South Korea: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం తర్వాత కొత్త ఆందోళన..! 8 d ago
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపధ్యంలో మరో ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది. జెజు ఎయిర్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్ సమస్యను ఎదుర్కొంది. జెజు ఎయిర్లైట్ విమానము 7C101 సోమవారం ఉదయం సియోల్‌లోని గింపో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జెజు ద్వీపానికి బయల్దేరింది. కొద్ది క్షణాలలోనే విమానం తిరిగి గింపో విమానాశ్రయంలో ల్యాండయ్యింది. గేర్ సమస్యను గుర్తించడం వల్లే మళ్లీ తిరిగి రావలసి వచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది.